షర్మిల సభలో జగన్ ఫాన్స్ ఓవర్ యాక్షన్, చెంప చెల్లుమనిపించేలా రిప్లై ఇచ్చిన షర్మిల.

ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏరోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.

పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.

వెలుగొండ ప్రాజెక్ట్ వైఎస్సార్ కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని.. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు.. 15 లక్షల మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ అని తెలిపారు. ప్రాజెక్ట్ 60 శాతం వైఎస్సార్ హయాంలో పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శ చేశారని.. అధికారంలో వచ్చాకా 6 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.

ఐదేళ్లు అధికారం అనుభవించి తట్టెడు మట్టి తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.వైఎస్సార్ వారసులు వీళ్లా అని మండిపడ్డారు. సాగునీరు లేదు.. త్రాగునీరు లేదన్నారు. గుక్కెడు నీళ్ళ కోసం ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. సాగునీరు లేక నియోజకవర్గంలో వలసలు పోతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *