గతంలో కూడా సీఎం జగన్ హెలికాప్టర్‌లో పలు సాంకేతిక లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హెలిప్యాడ్‌కు సంబంధించి మరో ఘటన పునరావృతం కావడంతో వైసీపీ క్యాడర్ ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ..అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా “మేమంతా సిద్ధం” పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. పూర్తీ వివరాలోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు.

ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశృతి చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు అక్కడున్న ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దీన్ని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ను కొద్దగా పైకి లేపారు.
ఒక వేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని నిపుణులు చెపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.