పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా. బాబు పేరేంటో తెలుసా..?

తాను తల్లికాబోతున్నట్లు ఇలియానా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. అప్పటి నుంచి బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌చేస్తూ వస్తున్నది. ఇక జూలైలో తన ప్రియుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో ఉంచినప్పటికీ.. ఆయన పేరును మాత్రం వెళ్లడించలేదు. అయితే పెళ్లి కాకుండానే ప్రగ్నెన్సీ, దానికి కారణం ఎవరో చెప్పకపోవడంతో అభిమానులు, నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇటీవల ఒక అబ్బాయితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి డేట్ నైట్ అని రాసి లవ్ సింబల్ వేసింది. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతనే, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని కామెంట్స్ చేశారు పలువురు నెటిజన్లు. అతను ఓ విదేశీయుడు కావడం గమనార్హం. ఇలియానా డెలివరీ అయింది. ఆగస్టు 1న ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇలియానా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

తన బాబు ఫోటోని కూడా పోస్ట్ చేసింది. తన బాబుకి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే పేరు పెట్టినట్టు ప్రకటించింది. ఈ పేరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నా బాబు మాత్రం క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తన బాబు ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చెప్పలేకపోతున్నాను. ఈ ప్రపంచంలోకి నా బాబుకి స్వాగతం అని పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *