కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. భవతరణి భౌతికకాయాన్ని రేపటిలోగా చెన్నైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇళయారాజా కూతురు మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి ఈరోజు సాయంత్రం శ్రీలంకలో కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతున్న తుది శ్వాస విడిచారు.
ఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకకు తీసుకెళ్లగా.. నేడు సాయంత్రం 5.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె వయసు 47 ఏళ్లు. భవతారిణి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు.