తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషలకు చెందిన తారల చిన్ననాటి జ్ఞాపకాలు నెట్టింట అనేకం. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ బాల్యం ఫోటో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ బుజ్జాయి దక్షిణాదిలోనే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈ అమ్మాయి సినిమాలు చేస్తుంది.
అయితే అయితే ఆమె తండ్రి రాజేష్ 38 ఏళ్ల వయసులో చనిపోయాడు. మద్యానికి బానిసై చనిపోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి రాజేష్ ఒకప్పుడు తెలుగులో గొప్ప నటుడు. ఆ తర్వాత ఐశ్వర్య పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు రాజేశ్ భార్య ఉన్న ఆస్తులన్నీ అమ్మేసింది.

చెన్నైలోని టీనగర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ను విక్రయించింది. ఆ తర్వాత అద్దె ఇంట్లో ఉన్న ఐశ్వర్య కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఓ ప్రమాదంలో ఐశ్వర్య ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తానే తీసుకుంది. ఓ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో మనాడ మైలాడ అనే రియాల్టీ షోలో విజేతగా నిలిచిన ఆమెకు ఆవగలం వీరిగళంలో ప్రియురాలి పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టకత్తి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది.