ఇండస్ట్రీలో మరో విషాదం. ICUలో ప్రముఖ నటుడు మృతి.

మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ హనీఫ్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హనీఫ్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొచ్చి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 9న కన్నుమూశారు. హనీఫ్ వయసు 63 ఏళ్ళని సమాచారం. హనీఫ్ తిరుచూరు లో జన్మించారు. 1990లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. పాపులర్ రాజకీయ నాయకులు, నటులను ఇమిటేట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే కేరళ ఎర్నాకులంకు మట్టంచేరికి చెందిన కళాభవన్ హనీఫ్ నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణించారు.

ఆయన దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించినట్లు సమాచారం. ఇక చదువు పూర్తైన వెంటనే కళాభవన్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కొనసాగారు. అలా ఆర్టిస్ట్ గా రాణిస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మూవీలో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో అంది వచ్చిన అవకాశాలతో కళాభవన్ అనేక చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపును మూట గట్టుకున్నారు. ఇదిలా ఉంటే..

ఆయన గత కొంత కాలం నంచి శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన తాజాగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మట్టంచెరలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కళాభవన్ హనీఫ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆయన చివరి సారిగా నటించిన చిత్రం జలధార పంపు సెట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *