హైపర్ ఆది లేడీస్ హాస్టల్ లో ఉన్నాడా..? ఆ టాప్ సీక్రేట్ బయటకు రావడంతో..?

హైపర్ ఆది..ఒకప్పుడు మారుమూల పల్లెటూరిలో సరదాగా సెటైర్లు వేస్తూ.. ఊళ్ళో అందరిని నవ్విస్తూ గడిపేసిన సాధారణ వ్యక్తి. కాని ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆయన పంచ్ వేస్తూ సామాన్యులతో పాటు.. సెలబ్రిటీల్ కూడా నవ్వని వారంటూ లేదు. అప్పుడు ఊళ్ళో నలుగురిని నవ్వించిన ఆది వెనకాల బోలెడు కష్టాలు ఉన్నాయి.

కాని అప్పుడు ఆది కామెడీ టైమింగ్.. సరదాగా వేసే పంచ్ లే ఆదికి బలంగా మారాయి. సంపాదనకు మార్గాన్ని అందించాయి. హైదరాబాద్ వచ్చిన మొదటిలో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి.అయితే మా బంధువులు ఒకరు లేడీస్ హాస్టల్ పెట్టారు నేను కూడా అక్కడే ఉండేవాడిని.

హాస్టల్ పైన ఉండగా కింద ఒక గది ఉండేదని నేను అక్కడ ఉండే వాడినని తెలిపారు అయితే హాస్టల్లో అమ్మాయిలందరూ భోజనం చేయడానికి కిందకు వస్తున్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు పడేవాడిని.వారు భోజనానికి వచ్చేముందు నేను గది లోపలికి వెళ్లిపోయి అసలు బయటకు వచ్చేవాడిని కాదు లేదంటే బయటకు వెళ్ళిపోయే వాడినని తెలిపారు. వారందరూ భోజనం చేసి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చేవాడినని తెలియజేశారు.

ఇలా అమ్మాయిలందరూ భోజనం కోసం కిందకు వస్తున్నప్పుడు నేనేంటి ఇలా అమ్మాయిల హాస్టల్ లో ఉన్నాను అని ఎన్నో సందర్భాలలో అవమానంగా ఫీల్ అయ్యానని హైపర్ ఆది తెలిపారు. అయితే తాను జబర్దస్త్ లో సెకండ్ లీడ్ కమెడియన్ గా చేసినప్పటి నుంచి ఫైనాన్షియల్ గా నిలదొక్కుకున్నానని ఆది తెలిపారు.ఇక ప్రస్తుతం ఈయన టాప్ కమెడియన్ గా కొనసాగుతూ ఇటు వెండితెర పైన బుల్లితెర పైన ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *