బిగ్ షాక్, టాలీవుడ్ సింగర్ చిన్మయి పై పోలీస్ కేసు నమోదు.

తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడపిల్లలపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ వీడియోలో చిన్మయి మాటలు మన దేశాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ హెచ్ యు విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఓ బాధ్యత గల పౌరురాలిగా ఉంటూ దేశాన్ని కించపరచడం భావ్యం కాదని.. ఆయన ఈ ఫిర్యాదులో వెల్ల‌డించాడు.

ఇక గచ్చిబౌలి పోలీసులు దీంతో అమ్మ పై కేసు నమోదు చేశారు. తాజాగా సీనియర్ న‌టి అన్నపూర్ణమ్మ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలకు అర్థరాత్రి స్వతంత్రం ఎందుకు అంటూ మాట్లాడింది. రాత్రి 12 గంటల తర్వాత బయట వాళ్లకి ఏం పని.. అమ్మాయిలు కూడా బయట ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.. మన బట్టలు ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉంటే అచ్చంగా వారిదే తప్ప అనడంలో న్యాయం లేదు..

మనది కూడా ఎంతో కొంత తప్పు ఉంటుంది అంటూ వివరించింది. ఈ వీడియో పై చిన్నయి ఫైర్ అవుతూ నేను అన్నపూర్ణమ్మ గారికి పెద్ద ఫ్యాన్‌. కానీ ఒక్కోసారి మనం అభిమానించే స్టార్లే ఇలా మాట్లాడితే హాట్ బ్రేక్ అయినట్లు అనిపిస్తుంది అంటూ మాట్లాడింది. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ.. ఇదొక కంట్రీ అంటూ దేశాన్ని హేళ్ళన చేసేలా మాట్లాడింది. దేశానికి కించపరిచేలా చిన్మయి చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *