బండ్ల గణేష్ నటుడు నిర్మాత గా కంటే ఆడియో ఫంక్షన్ లలో తన స్పీచ్ లతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. పవన్ కల్యాణ్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ఆయన స్పీచ్ వీడియోలకు లక్షల్లో వ్యూవ్స్ వస్తుంటాయి. ఇక కేవలం సినిమాలలోనే కాకుండా బండ్ల గణేష్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఎన్నికల తరవాత బయటకు వచ్చారు. అయితే తాజాగా బండ్ల గణేష్ హాస్పిటల్లో బెడ్ పై చేతికి సిలైన్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఆయనకేం జరిగిందనే విషయం మీద క్లారిటీ లేకపోయినా ఆయన వైరల్ ఫీవర్ తో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారని అంటున్నారు. అయితే ఈ విషయం మీద బండ్ల గణేష్ స్పందించాల్సి ఉంది.
అసలు బండ్ల గణేష్ కి ఏమైంది? ఎందుకు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు? అంటూ నెటిజన్లు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం మీద బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక సినిమాలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ ఒక సినిమా అనౌన్స్ చేశారు కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.