వీర సింహారెడ్డి మూవీలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది హానీ రోజ్. దీంతో తన ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది హానీ రోజ్.
ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ వదులుతూ మాయ చేస్తోంది. సినిమాల సంగతి అటుంచితే అమ్మడి పిక్స్‌కి మాత్రం మంచి గిరాకీ లభిస్తోంది. అయితే తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. చీరకట్టులో తన భారీ సొగసు చూపిస్తూ పచ్చికపై చేసిన ఫొటోస్ షూట్ వైరల్ అవుతోంది.
నడుము సొగసు చూపిస్తూ అందంగా నడుచుకుంటూ వస్తున్న హనీ రోజ్ ఫోజులు మెరుపులు మెరిపించేలా ఉన్నాయి. హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. హనీ రోజ్ అలా విధంగా నడుము సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా ఆలౌట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ హనీ రోజ్ చిన్న పాటి విస్ఫోటనమే సృష్టిస్తోంది.