మత్తెక్కించే అందచందాలతో మైమరిపిస్తుంది హనీ రోజ్. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ డోస్ పెంచేసింది. కేరళ స్టైయిల్‌లో దర్శనమిస్తూ కుర్రకారును చిత్తు చేస్తుంది. ఫోటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ రెచ్చిపోతుంది. ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే హనీ రోజ్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయని భావించారు. అయితే ఆ సూచనలేమీలేవు. అధికారికంగా తెలుగులో హనీ రోజ్ చిత్రాలు ప్రకటించలేదు. ఇతర భాషల్లో రెండు చిత్రాలు చేస్తుంది. రాచెల్, తేరి మేరీ చిత్రాల్లో హనీ రోజ్ నటిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే 2008లోనే హానీ రోజ్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
శివాజీ హీరోగా తెరకెక్కిన ఆలయం చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా ఆడలేదు. దాంతో గ్యాప్ వచ్చింది. మరో ఆరేళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ తో జతకట్టింది. 2014లో విడుదలైన ఈ వర్షం సాక్షిగా చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా నిరాశపరిచింది. దాదాపు 9 ఏళ్ళ అనంతరం వీరసింహారెడ్డి చిత్రం చేసింది. మలయాళ భామ అయిన హనీ రోజ్ ప్రస్తుత వయసు 32. ఆమెకు ఇంకా చాలా కెరీర్ ఉంది. నటిగా, మోడల్ గా భారీగా సంపాదిస్తుంది.