తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులు.

పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ ఇలా చేయకండి. పిల్లల పెంపకంలో ఏదైనా లోపం ఉంటే దానికి కారణం తల్లిదండ్రులదే అని కూడా అంటుంటారు. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలివిగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో, వారి పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంటారు అందువల్ల, మీరు పిల్లలకు మెరుగైన సంరక్షణను అందించాలనుకుంటే, మీ మధ్య మంచి ప్రవర్తనను కొనసాగించాలి. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళు చాలా విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడే ఊహ వస్తుంది. చాలా విషయాలను గమనిస్తూ ఉంటారు.

ఇంట్లో వాతావరణం ముఖ్యంగా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అమ్మానాన్నలు తనతో ప్రేమగా ఉన్నారా.. ఇద్దరిలో ఎవరు తనతో ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు. ఇలా చాలా విషయాలు వాళ్ళ చిన్ని బుర్రల్లో ముద్ర వేసుకుంటూ ఉంటాయి. అదే కుటుంబంలో కాస్త గందరగోళం కలిగించే సందర్భాలు, సమయాలు తరుచుగా ఉంటూ ఉంటే అది పిల్లల ప్రవర్తన మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. కోపాన్ని పిల్లల మీద చూపించకండి.. భాగస్వామితో గొడవ పడ్డప్పుడు ఆ కోపాన్ని పిల్లల మీద చూపించకండి. ఇది ఉక్రోషంతో చేస్తున్న పని అని పిల్లలు అర్థం చేసుకోలేరు.

పిల్లల ముందు అరవద్దు..పిల్లలు పక్కనే ఉన్నరనే ఆలోచన లేకుండా చిన్న చిన్నవాటికే పెద్ద గొంతుతో అరవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల వారిలో వ్యతిరేక భావాన్ని నింపేసిన వారవుతారు. దూకుడుగా తయారయ్యి, ఎదిరంచేట్టు స్వభావాన్ని మీరే ఇస్తున్నారు. కాబట్టి చాలా వరకూ సమస్య ఏదైనా పిల్లల ముందు తీసుకురాకండి. వారి ముందు చర్చించుకోవద్దు. పిల్లల ముందే..ఇంట్లోని పెద్దలను విమర్మించే పని పెట్టుకోకండి. ఇలాంటివి పిల్లల మనసుపై ప్రవర్తనపైన చాలా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.

పోలికలొద్దు..ఎదుటివారి ముందు పొగడ్తల్లో ముంచేయడం, ఎదుటివారితో పోల్చి తిట్టడం రెండూ తల్లిదండ్రులు చేయకూడని పనులు. ఒత్తిడి తీసుకువచ్చి చదివించకండి..చదువు ముఖ్యమని చదువులేనిదే జీవితం గందరగోళంగా మారుతుందని చెప్పడం వరకూ సరే కానీ పిల్లలను చదువు విషయంగా ఒత్తిడి చేయడం మానుకోండి. ఈ విషయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కాస్త ఓపెన్ గా మనసులో మాటలను పంచుకుంటారు.

పిల్లల్ని పదే పదే ఒత్తిడి చేసి చదివిచడం వల్ల అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. పిల్లలకు లంచాలు ఇవ్వకండి.. ఏదైనా పని చేసిపెడితే ఇది కొంటానని అది ఇస్తానని పిల్లలుకు ఆ్రశపెట్టి వాళ్ళచేత అనుకున్నపని చేయించడం తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు.. ఏడుస్తున్నారా కాసేపు వదిలేయండి. పిల్లలు కాస్త పెరిగి పెద్దయ్యే వరకూ వారి ప్రతి కదలికను గమనించే పని తల్లిదండ్రులదే.. వారి భవిష్యత్ బాగుండేలా ప్రోత్సహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *