తన నివాసంలోని బాత్ టబ్‌లో మునిగిపోవడం వల్ల అతను మరణించినట్లు తెలుస్తోంది. 54 సంవత్సరాలు మాథ్యూ మరణవార్త విని సినీ ప్రియులు, సెలబ్రెటీలు షాకవుతున్నారు. అంతేకాకుండా మాథ్యూ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుల్లితెరపైనే కాకుండా అనేక సినిమాల్లోనూ నటించి మెప్పించాడు మాథ్యూ, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో స్టార్స్ మరణిస్తున్నారు.
తాజాగా హాలీవుడ్ స్టార్ మాథ్యూకూడా అలానే మరణించారు. హాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్లు మరణిస్తున్నారు. రీసెంట్ గా అమెరికన్ -కెనడియన్ హాస్యనటుడు మాథ్యూ పెర్రీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సిట్‌కామ్ ఫ్రెండ్స్ సిరీస్‌తో ఫేమస్ అయిన మాథ్యూ పెర్రీ 54 ఏళ్ల వయసులో మరణించారు. ఫెర్రీ మరణంతో హాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సిట్‌కామ్ ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది.

ఫేమ్ మాథ్యూ పెర్రీ మృతి అభిమానులకు తీవ్ర దిగ్రాంతికి గురిచేసింది. సినీ పరిశ్రమ నుంచి వరుసగా సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. మాథ్యూ 90 స్ లో ఫ్రెండ్స్ షోలో చాండ్లర్ బింగ్ పాత్రను పోషించారు. ఈ షో ద్వారా ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక గుర్తింపు సాధిచారు మాథ్యూ. లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం, మాథ్యూ మృతదేహం అతని ఇంట్లో హాట్ టబ్‌లో గుర్తించారు. నీట మునిగి మాథ్యూ మృతి చెందినట్లు చెబుతున్నారు.