తెలుగు, తమిళ్ సినిమాల్లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ప్రత్యుషా సడెన్ గా ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ప్రత్యూష తల్లి సరోజిని దేవి చాలా కాలం న్యాయం కోసం పోరాడారు. అయితే ప్రత్యూష మృతి చెంది చాలా కాలం అయినప్పటికీ ఆమె మృతికి గల కారణాలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా అప్పట్లో సినీ పరిశ్రమకు చెందినటువంటి
ఇద్దరు వ్యక్తులు మరియు ఓ ప్రముఖ రాజకీయ వేత్త కుమారులు ముగ్గురు కలిసి హీరోయిన్ ప్రత్యూష పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని, దీంతో నిందితులు తమకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకుని కేసును తప్పుదోవ పట్టించే క్రమంలో ఆత్మహత్యగా చిత్రీకరించారని సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు హీరోయిన్ ప్రత్యూష సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని ఈ ప్రేమ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి పెళ్లికి నిరాకరించారని,
అందువల్లనే హీరోయిన్ ప్రత్యూష ఆత్మహత్యకి పాల్పడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసిందని అంటున్నారు. అయితే హీరోయిన్ ప్రత్యూష మరణించి దాదాపుగా 18 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆమె మరణానికి సంబంధించినటువంటి గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రత్యూష నటించినటువంటి రాయుడు, శ్రీరాములయ్య, కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా , తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.