గ్రాండ్‌గా హీరోని పెళ్లాడిన యంగ్ హీరోయిన్‌, పెళ్లి వీడియో వైరల్.

తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది.. యంగ్ హీరోయిన్ నూరిన్‌ షరీఫ్‌, ప్రియుడు ఫహిమ్‌ సఫర్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సహ నటుడైన ఫహిమ్‌ సఫర్‌ను నటి నూరిన్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది. అయితే యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తనతో పాటు కలిసి పనిచేసిన ఓ నటుడితో ప్రేమలో పడింది. కొన్ని నెలల ముందు నిశ్చితార్థం చేసుకుంది.

ఫైనల్‌గా ఇప్పుడు గ్రాండ్ లెవల్లో జరిగిన వేడుకలో నిఖా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని స్వయంగా ఆ బ్యూటీనే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అవికాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. ప్రియా ప్రకాశ్ వారియర్ ‘లవర్స్ డే’ (మలయాళంలో ‘ఒరు అదార్ లవ్’) అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. అయితే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్. ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో మలయాళంలో నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ‘చంక్జ్’తో నటిగా మారింది.

ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది. అలా ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్‌కు పరిచయమైంది. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. తిరువనంతపురంలో సోమవారం ఓ వెడ్డింగ్ హాల్‌లో నిఖా చేసుకున్నారు. వీళ్లకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *