ఇప్పుడున్న హీరోయిన్స్ చాలామంది ఫెమ్ ఉన్నన్ని రోజులు సినిమాల్లో నటించి ఫేడ్ అవుట్ అయిపోవగానే పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు.అలా హీరోయిన్ గా సినిమాల్లో చేసి ఆ తర్వాత బిజినెస్ మ్యాన్స్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ చాలానే ఉన్నారు. అయితే శిల్పాశెట్టి ముంబై లో ప్రముఖ వ్యాపారవేత్త గా గుర్తింపు పొందిన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈయన అశ్లీల వీడియోల కేసులో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు.
దీంతో ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సోనం కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ను వివాహం చేసుకున్నారు. ఆమె సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా, వజ్రాల వ్యాపారి భరత్ తక్తాని ని వివాహం చేసుకుంది. బాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందిన టీనా రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ని వివాహం చేసుకుంది.
అప్పట్లో వీరి ప్రేమ వివాహం దేశంలోనే పెద్ద సంచలనం అయ్యింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె, మైక్రోమాక్స్ సీఈఓ అయిన రాహుల్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశిన్ గజిని సినిమాతో ఇండియా వైజ్‌గా సూపర్ పాపులర్ అయ్యింది. దక్షిణ సినీ ఇండస్ట్రీలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ , ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రీమాసేన్ రీమా రెస్టారెంట్ అధినేత శివ కరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది.