పెళ్లి తర్వాత కూడా ఈ చిత్రంలో ఆనంది బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. పెళ్లి తర్వాత హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే కాస్త అలొచ్చిస్తారు. కొంతమంది ఒప్పుకోరు. ఆనంది కూడా మాంగై చిత్రాన్ని మొదట రిజెక్ట్ చేసిందట. అయితే తెలుగు ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేసి.. ఇక్కడ మంచి పేరు రాకపోవడంతో తమిళనాడుకు చెక్కేసిన పదహారణాల తెలిగింటి ఆడ పిల్ల ఆనంది.
అమె అసలు పేరు రక్షిత.. ఆ తర్వాత హసిక పేరుతో ఈ రోజుల్లో, బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్ (చిన్న గెస్ట్ రోల్) చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇక్కడ పేరు రాకపోవడంతో పొరిగిల్లు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ ఆనందిగా పేరు మార్చుకుంది. పొరిగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగానే.. అక్కడి వెళ్లాక ఆమెకు అవకాశాలు రావడం ప్రారంభించాయి. అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జాంబి రెడ్డి మూవీతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం వంటి చిత్రాల్లో మెరిసింది. 2021లోతమిళ కో డైరెక్టర్ సోక్రటీస్‌ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు బై లింగ్వల్ మూవీతో ముందుకు వస్తుంది. అదే మంగై. అయితే అందులో బోల్డ్ సీన్లలో నటించింది అమ్మడు. అయితే అలా నటించాలని భర్తే ప్రోత్సహించినట్లు చెప్పింది ఆనంది. ఒక సోషల్ మూవీ కావడంతో ఆయనే ఈ మూవీ చేయాలని చెప్పారని పేర్కొంది. మున్నార్ నుండి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి.. ఎదుర్కొన్న పరిస్థితులు, మగాళ్లు.. ఒక ఆడదాన్ని చూసే కోణం చుట్టూ కథ తిరుగుతుంది.
ఇటీవల ఈ మూవీ పోస్టర్ విడుదలైంది. గుబెంతిరన్ కామచ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తొలుత అంగీకరించలేదట ఆనంది. ‘నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నేను చేయలేనని చెప్పాను. అందులో బోల్డ్ సన్నివేశాలు, భారీ డైలాగ్స్ ఉన్నాయి. కానీ నా భర్త ప్రోత్సహించారు. నువ్వు నటివి.. ఆ కోణంలోనే ఆలోచించు అని చెప్పారు. ఆ మాటలు నా కంఫర్ట్ జోన్ నుండి బయట పడేందుకు సాయ పడ్డాయి అని చెప్పారు. కాగా, ఈ మూవీని చూసి మగవారి ఆలోచనా ధోరణి మార్చాలని ఆశిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పారు.