సింహాద్రి హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

సింహాద్రి సినిమాతో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు.. పెద్దగా సక్సెస్ కాలేదు. ధనలక్ష్మీ ఐ లవ్ యూ, మనసు మాట వినదు, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా ఆడలేదు. అయితే అంకిత అనగానే అదరికి వెంటనే గుర్తుకు వచ్చేది జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన సింహాద్రి సినిమానే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అకింత, భూమిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

సినిమాలో అకింత చీమ చీమ అంటూ సాగే పాటలో ఎన్టీఆర్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ.. అవేవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. బాలకృష్ణతో కలిసి విజయేంద్రవర్మ, లాహరి లాహిర లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్‌ యూ, రారాజు, మనసు మాట వినదు వంటి సినిమాల్లో యాక్ట్‌ చేసినా.. ఆమెకు మంచి విజయం దక్కలేదు. కెరీర్‌లో సరైన హిట్స్‌ లేకపోవడం.. డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ కావడంతో.. పెళ్లి చేసుకుని.. జీవితంలో సెటిలైంది అంకిత.

తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ చిత్రాల్లో నటించిన అంకిత.. 2016లో సినిమాలకు గుడ్‌ బై చెప్పి.. విశాల్‌ జగతాప్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్‌ అయ్యింది. అక్కడ ఆమె సొంత ఇల్లు.. అది కూడా అర ఎకరం విస్తీర్ణంలో.. అందమైన ప్యాలెస్‌ నిర్మించుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది అంకిత. ఆమె భర్త విశాల్‌ అమెరికా సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం అంకిత ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *