అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా నటి హిమజ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కవు అని మొదటి నుంచి ఉన్న వాదన.. దీని పై చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. అయితే తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. కీలక రోల్స్ చేసింది. 2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.
నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. నిజానికి హిమజ హీరోయిన్ మెటీరియల్. కానీ ఆమెకు ఆఫర్స్ రాలేదు. తాజా ఇంటర్వ్యూలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడం పై ఆమె స్పందించారు. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది. అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదంటారు.

దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమజను యాంకర్ అడిగింది. సమాధానంగా హిమజ.. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే రుజువైంది. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు… అని అన్నారు. కొందరికి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అత్యాశ వలన అవి చేజారుతున్నాయి.
తెలుగు అమ్మయిలను కాకుండా కన్నడ, మలయాళ భామలను తీసుకోవడానికి మరో కారణం ఉంది. కొన్ని పాత్రలకు కొందరు సెట్ అవుతారని హిమజ చెప్పుకొచ్చింది. హిమజ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం విశేషం. హౌస్లో అమ్మడు బాగానే రాణించింది. హిమజ 9 వారాలు హౌస్లో ఉంది. ఈ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. యాంకర్ శ్రీముఖి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకుంది.