పుట్టిన రోజు వేడుకల పేరుతో న్యూసెన్స్ చేశారని స్థానికులు కంప్లైంట్ చేశారు. కాగా హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో బర్త్ డే వేడుకలు జరిగాయి.ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం జీబీ వెంచర్స్ లోని ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు. సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఆధ్వర్యంలో ఓ పార్టీ జరుగుతున్నట్టు స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు తెలిపారు.
అక్కడ లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో బిగ్ బాస్ హిమజ, హేమ, నీలిమ, యాంకర్ ప్రవీణ, తేజు, పవిత్ర, రోహిణి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బిగ్ బాస్ ఫేమ్ హిమజ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. తనను అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు. తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకుని, బంధువులు, తనకు కావాల్సిన వారిని పిలుచుకున్నానన్నారు.
తన కొత్త ఇంట్లో మొదటి దీపావళి కావడంతో బంధు మిత్రులను పిలిచి పార్టీ చేసుకున్నామని, ఆ సమయంలో ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని చూసి, అన్ని చెక్ చేసుకుని వెళ్లారన్నారు. తామేమి చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడలేదన్నారు. అయితే రేవ్ పార్టీ భగ్నం చేసి, తనను అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తికా అవాస్తం అన్నారు.