స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియడంతో… ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు… చంద్రబాబు రిమాండ్ ను అక్టోబరు 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు రిమాండ్ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తితో ఏకీభవించిన ఏసీబీ జడ్జి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ చేయడంపై ఏపీ సర్కారు.. హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏపీ శ్రీరామ్… ఉద్దేశ పూర్వకంగానే ప్రచారం జరిగిందని, జడ్జిలను వాల్ల కుటుం సభ్యులను కూడా ట్రోలింగ్ చేశారని, కావాలనే అసభ్య పోస్టులు పెట్టారని అన్నారు.
అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించిన నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్ధా వెంకన్నతో పాటు షోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేయనున్నారు.