100కు పైగా సినిమాలలో నటించి.. చివరకు అనాధలా మరణించిన తెలుగింటి హీరోయిన్.

దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా అవకాశాలు వచ్చినప్పుడే ఆర్థికంగా అన్ని విధాలుగా నిలదొక్కుకోవాలి లేదంటే భవిష్యత్ లో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. ఇదే రీతిలో అలనాటి తార మహానటి సావిత్రి ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఊహించని విధంగా కష్టాలపాలైంది. అయితే మరో తెలుగింటి హీరోయిన్ సుమారుగా 100కు పైగా సినిమాలలో నటించింది.

ఆఖరికి చికిత్సకు డబ్బులు లేక దీనస్థితిలో మరణించింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన నటి అశ్విని హీరోయిన్గా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళంలో కలుపుకొని 100కు పైగా సినిమాలలో నటించింది. తెలుగులో ‘ భక్త ధ్రువ మార్కండేయ ‘ అనే సినిమాలో బాలనటిగా కనిపించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్‌ మాస్టర్‌, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి సినిమాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

అయితే స్టార్ హీరోయిన్గా ఉన్న అశ్విని ఎవరికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకొని చిక్కుల్లో పడింది. పెళ్లి అయిన కొంతకాలానికి భర్త వదిలి వెళ్ళిపోవడంతో ఒంటరిగా కృంగిపోయింది. తర్వాత కార్తీక్ అనే బాబును దత్తత తీసుకొని పెంచుకుంది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో నటించింది. కొంతకాలానికి ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె పెద్దగా ఆస్తులను కూడబెట్టుకోలేదు. వైద్య చికిత్సల కోసం డబ్బులు లేక చెన్నైలో ఉన్న ఇల్లును అమ్మేసి అద్దె ఇంట్లో కాలం గడిపింది. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించి అశ్విని 2012లో మరణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *