వీటిని రోజూ తింటే..? మీకు జీవితంలో గుండె పోటు రమ్మన్నా రాదు.

సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది గుండె జబ్బులకి గురవుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రక్తనాళాలు కూడా ఎంతో ముఖ్యం. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. బ్రోకలీ, మొలకలు, క్యాబేజీ వంటి వాటిని మీరు డైట్ లో చేర్చుకుంటే, ఇటువంటి సమస్యలు ఏమి కూడా కలగవు.

వాస్కులర్ డిసీజెస్ రక్తనాళాలని ప్రభావితం చేస్తాయి. శరీరం చుట్టూ రక్త ప్రవాహాన్ని తగ్గించేస్తుంది. కొవ్వు, క్యాల్షియం నిక్షేపాలు గుండెపోటు, స్ట్రోక్ కి కారణం అవుతాయి. అయితే, ఈ కూరగాయలను తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఏమీ కూడా ఉండవు. విటమిన్ కె వుండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవడం వలన చాలా వరకు నష్టం కలగకుండా ఉంటుంది. విటమిన్ కె ఆకుపచ్చని కూరగాయల‌లో ఉంటుంది. ప్రతిరోజు కూడా 45 గ్రాముల కంటే ఎక్కువ పచ్చి కూరలు తీసుకోండి.

ఆకుకూరలను తీసుకుంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ప్రతిరోజు పండ్లు, సీ ఫుడ్, లీన్ మీట్, పాల‌తో పాటుగా ఆరోగ్యకరమైన నూనెలని, గింజలని తీసుకుంటూ ఉండాలి. మంచిగా కూరగాయలను ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. ఇలా కనుక మీరు మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లైతే, కచ్చితంగా గుండె జబ్బులు వంటి బాధలు ఏమీ కూడా కలగవు. ముఖ్యంగా కూరగాయలకి, ఆకుకూరలకి ప్రాధాన్యత ఇవ్వండి. డైట్ లో వీటిని చేర్చుకోవడం వలన చక్కటి పోషకాలు లభించి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *