ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. 57 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ జి మారిముత్తు (57) హఠన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో చెన్నైలోని ఎదురునీచెల్ అనే టీవీ సీరియల్ కోసం డబ్బింగ్ చెప్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
దీంతో ఆయనను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు మారిముత్తు మరణ వార్తను ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్, ఇండస్ట్రీ ఇన్‌సైడర్ రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. నటుడు మారిముత్తు మరణం తమిళ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్‌భ్రాంతికి గురి చేసింది. నటి రాధిక శరత్‌కుమార్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా దర్శకుడిగా, నటుడిగా మారిముత్తు కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
ఇప్పటి వరకూ దాదాపు 50కు పైగా చిత్రాల్లో నటించారు. అనేక టీవీ సీరియల్స్‌లలో కూడా నటించాడు. తమిళ టెలివిజన్ సిరీస్ ఎతిర్నీచల్‌లో ఆయన పాత్రకు పాపులారిటీ దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీలోనూ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాలో విలన్ నమ్మకస్తుడి పాత్రలో మారిముత్తు కనిపించాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో సహా పలువురు కీలక దర్శకులతో కలిసి పనిచేశాడు. మారిముత్తుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Condolences! Your work has been impeccable and irreplaceable. Rest in peace #Marimuthu pic.twitter.com/cdT2LgThwY
— Sun Pictures (@sunpictures) September 8, 2023