ప్రముఖ నటుడు కి మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. పూర్తీ వివరాలోకి వెళ్తే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది.
మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం కుందర జానీకి గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అయన తుదిశ్వాస విడిచారు. ఇక కుందర జానీ మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు విషయం ఈ తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు.

1979లో నిథమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు కుందర జానీ. ఇక ఆ తర్వాత క్రీడం, సెంగోల్, రాజవిందే మగన్, అరమ్ కిన్నారం, కాగల్గన్, కరీంబన, స్పటికం, అవనాళి వంటి చిత్రాలలో విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించిన కుందర జానీ మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా జానీ నటించారు.