ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం నడుపుతున్నాడు. దుకాణం పైఅంతస్తులో సుధీర్ భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లాడు. మర్నాడు ఉదయం 11 గంటలకు దుకాణానికి వచ్చి చూడగా.. వెనుక వైపు ఉన్న తలుపు తీసి ఉంది. కౌంటరులోని రూ.3,500 నగదు కనిపించలేదు. దీంతో వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇటీవల జనం మీద సినిమా ప్రభావం బాగానే పడింది. ఏం చేసిన పక్కా ఫ్లాన్‌తో బురిడీ కొట్టిస్తున్నారు.
తాజాగా ఎవరికీ అనుమానం రాకుండా.. ఇంటి ఓనరే.. తానూ అద్దెకు ఇచ్చిన షాపులోనే కన్నం వేశాడు. ఈ ఇంటి దొంగ ఎలా ప్లాన్ చేశాడన్న దానిపై కూపీ లాగిన పోలీసులకు షాకయ్యే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ ధరించి తన భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు.
చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు. రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో సింగారం గ్రామానికి చెందిన గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులోని నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.