ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఏంమాట్లాడాలో తెలియడం లేదన్నారు. అయితే టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. దాదాపు నెల రోజులు అనారోగ్యంతో కేసీఆర్ జనానికి కనిపించలేదు.
కానీ, పూర్తిగా కోలుకున్నాక ప్రచారం మొదలు పెట్టారు. నోటిఫికేషన్ వచ్చే నాటికే 30 సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించారు. తాజాగా మంగళవారం కొడుకు నియోజకవర్గం సిరిసిల్ల, మేనల్లుడి నియోజకవర్గం సిద్దిపేటలో ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులతోపాటు కేటుంబేతర అభ్యర్థులను గెలిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌పై తెలంగాణలో 60 శాతం వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయినా వాటిని అధిగమించగలమన్న ధీమా కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రమే తమకు ఓటు వేయరని, మిగతా అన్నివర్గాలు తమకు కలివస్తాయని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నారు. పెన్షనర్లు, రైతుల ఓట్లు 90 శాతం బీఆర్‌ఎస్‌కే పడతాయన్న నమ్మకంతో ఉన్నారు.
