ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో హీరోగా తేజా సజ్జా నటించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరి నటనకు మంచి మార్కులు పడటమే గాక.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి అంతా సలాం కొడుతున్నారు.
అయితే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలున్నాయి. వాటికి తగ్గట్లుగానే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హీరో, దర్శకుడు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది.
తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు. హిందీలో ఈ సినిమాకు అన్నీ హౌస్ ఫుల్ బోర్డులే పడుతున్నాయి. మొదటివారం ముగిసే సమయానికి రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.