గురువారం నాడు పుట్టిన శిశువులపై గురువు యొక్క ప్రభావం వలన వారు ఎక్కువగా శాంతి స్వభావం కలిగిన వారై వుంటారు. వారిలో ఎక్కువగా సద్గుణాలు నిండి ఉంటాయి. గురువారం నాడు పుట్టిన వారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ మంచి పనులు చేయడమే కాకుండా తన తోటి వారితో కూడా మంచి పనులు చేయించేందుకు ప్రేరణ కలిగిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువారం జన్మించిన వ్యక్తులు బృహస్పతి ప్రభావంతో కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారని నమ్ముతారు. బృహస్పతి అదృష్టం, ఐశ్వర్యం, వైవాహిక జీవితం, పిల్లలకు, సంపద లకు కారకంగా పరిగణించబడుతున్నాడు.
గురువారం జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు, ఆశావాద వ్యక్తులు అని అంటారు. అంతేకాదు ఎప్పుడూ సానుకూల దృక్పధం, అవుట్ గోయింగ్ స్వభావం, సాహసం, ప్రేమను కలిగి ఉంటారు. గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంపై సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. హాస్యచతురతను కలిగి ఉంటారు. ఇతరులను నవ్విస్తూ.. తాము సంతోషపడతారు. స్నేహితులు, సహోద్యోగులలో ప్రముఖులుగా నిలుస్తారు. దాతృత్వ గుణం కలిగి ఉంటారు. సాహస నేచర్ ను కలిగి ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. తరచుగా ప్రయాణాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు.
కొత్త అనుభవాలను ఇష్టపడతారు. తమ పరిధులను విస్తృతం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మార్గాలను అన్వేషిస్తారు. గురువారం జన్మించిన వ్యక్తులు నమ్మకమైన, అంకితమైన భాగస్వాములుగా చెప్పబడతారు. నిజాయితీ, నమ్మకానికి విలువ ఇస్తారు. బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అంతేకాదు శృంగారభరితంగా ఉంటారు. దయ కలిగిన వ్యక్తులు. గురువారం జన్మించిన వ్యక్తులు నైతికతకు విలువ ఇస్తారు. న్యాయాన్ని విశ్వసిస్తారు. తమ వ్యవహారాలను నిజాయితీగా, సూటిగా నెరపడానికి ఆసక్తిని చూపిస్తారు.
గురువారం జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రేమ మూర్తులు. సహజమైన ఉత్సుకతను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త జ్ఞానాన్ని, అనుభవాలను కోరుకుంటారు. త్వరగా నేర్చుకుంటారు. సమాచారాన్ని గ్రహించడంలో, భిన్నమైన ఆలోచనల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో ప్రతిభను కలిగి ఉంటారు. వీరి ఆశావాద స్వభావం ఉన్నప్పటికీ.. గురువారం-జన్మించిన వ్యక్తులు అతిగా తినడాన్నీ ఇష్టపడతారు. సహజమైన ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆహారం, విలాసాలు కొన్నిసార్లు వ్యసనంగా మారవచ్చు లేదా కంపల్సివ్ ప్రవర్తనతో సమస్యలకు దారి తీయవచ్చు.