బుర్ఖా వేసుకొని తప్పించుకున్న కలర్స్ స్వాతి, అసలు విషయమేంటంటే..?

కలర్స్ స్వాతి హీరోయిన్గా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ అయినప్పటికీ అనంతరం ఈమెకు అవకాశాలు రాకపోవడంతో వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు. అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న స్వాతి ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఫైలెట్ ను వివాహమాడిన స్వాతి కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే స్వాతి రీ ఎంట్రీ ఇచ్చింది. పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు, సత్య ఇలాంటి ప్రాజెక్ట్స్ లో నటించింది.

ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ .. భర్తతో విడిపోతుందని వార్తలు వచ్చాయి. భర్తకు, ఆమెకు పడడం లేదని, అందుకే వారు విడాకులు తీసుకుంటున్నారు అని పుకార్లు షికార్లు చేసాయి. కానీ, అందులో నిజం లేదని స్వాతి చెప్పుకురావడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. ఇక తాజాగా స్వాతి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బుర్ఖా వేసుకొని షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుర్ఖా ధరించి ట్రైన్ ఎక్కడమే కాకుండా ఎంచక్కా ఎవరికి తెలియకుండా జనాల మధ్యలో తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

ఇక దీనికి క్యాప్షన్ గా.. ‘ఒకవేళ కవర్ లచేసుకోకుండా బయటకు వెళ్తే.. ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చింది. సాధారణంగా ప్రజల మధ్య సినీ సెలబ్రిటీలు తిరిగితే సెల్ఫీలు, వీడియోలు అంటూ విసిగిస్తారు అన్న విషయం తెల్సిందే. అందుకే ఆమె ఇలా బుర్ఖా వేసుకొని తిరిగింది. ఒకవేళ ఆమె కనిపిస్తే .. ఖచ్చితంగా మీడియా విడాకుల రూమర్స్ గురించి అడిగేవారే.. అందుకే బుర్ఖా వేసుకొని తప్పించుకోంది అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *