మహేష్ బాబు ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉన్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత గుంటూరు కారం మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. అయితే తెలుగు సినిమాతో మీనాక్షి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితం అందకపోయేసరికి ఐటం ఐటెం సాంగ్స్ లో నటించింది.
దూకుడు సినిమాతో మీనాక్షికి మంచి పేరు వచ్చింది. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి లో కూడా ఆమె ఒక కీలకపాత్రను నటించింది. మహేష్ ఫ్రెండ్ గా మీనాక్షి కనిపించింది. అయితే ఇన్ని రోజుల తరువాత అమ్మడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే..ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు.. సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మీనాక్షి మహేష్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. బిలేటెడ్ గా హ్యాపీ బర్త్ డాట్ చెప్తూ మహర్షి రోజులను గుర్తుచేసుకుంది. మహర్షి లోని కొన్ని స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆ మెమొరీస్ ను పంచుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Belated happy birthday @urstrulyMahesh Sharing some amazing memories from the sets of #Maharshi 😇#HBDMaheshBabu #HBDSuperstarMaheshBabu pic.twitter.com/D6920UnSEN
— Meenakshi Dixit (@Meenaxidixit) August 11, 2023