ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. అయితే ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను సోమవారం ఉపాసన లాంచ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జూబ్లీహీల్స్ లోని అపోలో ఆసుపత్రిలో నిర్వహించగా.. అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించారు ఉపాసన.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. తాను తల్లి కాబోతున్నట్లు తెలిసిన తర్వాత అందరూ తనపై ఎంతో ప్రేమ కురిపించారని.. తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. “ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ఎమోషనల్ జర్నీ. పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారు.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో పేరెంట్స్ వద్దకు చేర్చడం మా బాధ్యత. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు.
ఇప్పుడు నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని . పిల్లలకు అనారోగ్యానికి గురయితే ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతారో నాకు తెలుస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ఇబ్బందిపడడం నేను చూశాను. కొందరు మహిళలు నా దగ్గరకు వచ్చి తమ బాధ చెప్పుకున్నారు. వాళ్లలో సింగిల్స్ మదర్స్ ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ చాలా అవసరం. అందుకే మేము ఓ ప్రకటన చేస్తున్నాము. వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి ఉచితంగా వైద్యం పొందవచ్చు. దీనివల్ల వారికి మేలు లాభం చేకూరుతుందని అనుకుంటున్నాను. వాళ్లను ప్రోత్సాహం ఇస్తాను. ఇది ఎమోషనల్ జర్నీ ” అంటూ చెప్పుకొచ్చారు.