చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటిని సంపాదించుకుంది. ఫోటోలు, డాన్స్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా సితార ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. PMJ జ్యువెలరీస్ కోసం సితార ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. ఇక ఈ యాడ్ కి సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు.
అంతేకాకుండా సితార ఆ ప్రముఖ జ్యువెలరీ ధరించిన ఫోటోలను ఏకంగా న్యూయార్క్ టైం స్క్వేర్స్ లో ప్రదర్శిస్తూ ప్రమోషన్ చేశారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సాధారణంగా స్టార్ కిడ్స్ పుట్టిన రోజు అంటే హంగులు, ఆర్భాటాలు, కేక్ కటింగులు, పార్టీలు గట్రా చాలా ఉంటాయి. అయితే మహేష్ అడుగుజాడల్లో నడుస్తోన్న సితార సింపుల్‌గా తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది.
మహేష్ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి కేట్ కట్ చేసిన సితార వారందరికీ ప్రేమతో కేక్ తినిపించింది. వారితో సరదాగా ముచ్చటించింది. సెలబ్రేషన్స్ అనంతరం అక్కడున్న అమ్మాయిలందరికీ పింక్ కలర్‌లో ఉన్న సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇప్పుడు ఆ బాలికలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వారందరికీ స్కూల్ కేవలం సైకిల్ దూరంలో మాత్రమే ఉంది. నీలో ఇతరులపై అమితమైన ప్రేమను చూపించే గొప్ప మనసు ఉంది.