తాజాగా తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు లక్ష మంది భక్తులు చేరుకుంటుండటం. సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ శ్రేణులపై వాటర్ క్యానన్లతో అడ్డుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
రద్దీకి తగిన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగగా బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే అయ్యప్పభక్తులకు గుడ్ న్యూస్.. శబరిమల అయ్యప్పస్వామి దర్శన సమయాన్ని పెంచుతూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా అయ్యప్ప స్వామి భక్తులు పెరుగుతుండటంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో కొండలు కిక్కిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో భక్తులు వీలైనంత త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా దర్శన సమయాన్ని గంటపాటు పెంచారు. రోజులో రెండో భాగంలో ఈ దర్శన సమయాన్ని పెంచారు. సాధారణంగా రోజులో రెండోభాగంలో సాయంత్రం 4 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. ఇప్పుడు దీనిని సాయంత్రం నాలుగు గంటలకు బదులు 3 గంటలకు మార్చారు. ఫలితంగా దర్శన సమయం గంట పెరిగింది. ఇక నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు రెండోదశ దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.