నిజానికి ఇన్ని రోజుల పాటు తగ్గడమనేది నిజంగా హర్షించదగిన పరిణామమే. ఎంత తగ్గిందనేది పక్కనబెడితే నాలుగురోజుల్లో దాదాపు తులంపై రూ.800 మేర తగ్గింది. ఈ ఏడాది ప్రథమార్థంలో రోజువారీ పెరిగి షాకిచ్చిన బంగారం.. ఇప్పుడు మాత్రం తగ్గడం ఆరంభించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా కిందకు దిగాయి.
మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి.. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి, రూ. 59, 510 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 54, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 76, 200 గా నమోదు అయ్యాయి.