బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు కాస్త నిరాశపర్చినా ప్రభాస్ క్రేజ్‌లో ఇసుమంతైనా తగ్గలేదు. ప్రభాస్ కూడా తన అభిమానులను ఎంతో గౌరవిస్తారు. అడిగిన వారందరికీ సాయం చేస్తుంటాడు. అలాగే తనను కలిసేందుకు వచ్చిన వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటివరకు వివాదాలు, విమర్శలు లేని హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి.
ఇక ప్రభాస్ ను చూడడం కోసం ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మూమెంట్ వస్తే ఇదుగో ఇలానే సంతోషంతో ఎగిరిగంతేస్తారు. ఈ వీడియోలో ఉన్న ఒక యువతీ ఎయిర్ పోర్టులో ప్రభాస్ ని చూసి సంతోషంతో గంతులు వేసింది. డార్లింగ్ దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంది. ఫోటోలు దిగింది. అనంతరం ప్రభాస్ తో మాట్లాడుతూ.. వచ్చేటప్పుడు అతని చెంపపై కొట్టేసి పారిపోయింది. దీంతో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షాక్ కు గురయ్యారు.
ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అంటూ ఫైర్ అయ్యారు. అయితే నేను చూస్తుంది నిజమా..? అని ప్రభాస్ ను తాకి ఆమె నిజమని గ్రహించి వెనక్కి వచ్చేసిందని, అది సంతోషంగా చేసిన పనే తప్ప వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ మధ్య జరిగిన సంఘటన కాదు.. 2019లో జరిగిన ఘటన కాగా ఇప్పుడు ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు.