గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నటుడు మన్జోత్ తాను చదువుకుంటున్న కాలేజ్‌లో ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయిన ఓ 18 ఏళ్ల యువతిని కాపాడాడు మన్జోత్. బిల్డింగ్ పైనుంచి దూకేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మన్జోత్ పక్క గోడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దూకుతున్న యువతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
దీంతో అతడికి సాయం చేసేందుకు మరికొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారి హెల్ప్‌తో ఆ యువతిని మన్జోత్ పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలు తీసుకోవాలనుకున్న యువతిని ‘యానిమల్’ యాక్టర్ కాపాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన్జోత్ అమ్మాయిని కాపాడిన వీడియో ఇప్పటిది కాదు. అది అతడి కాలేజ్ టైమ్‌లోది. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్‌లో అతడు కాపాడిన అమ్మాయిని తర్వాత శారదా హాస్పిటల్లో చేర్పించారు.
తల్లితో గొడవ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అయితే లాస్ట్ మూమెంట్లో మన్జోత్ వచ్చి రక్షించడంతో బతికిపోయింది. అనంతరం ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇక, అమ్మాయిని కాపాడినందుకు గానూ అప్పటి ఢిల్లీ సిఖ్ కమ్యూనిటీ ప్రెజిడెంట్ మంజీత్ సింగ్ జీకే మన్జోత్ను మెచ్చుకున్నారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అతడికి అయ్యే మొత్తం ఖర్చుల్ని భరిస్తామని హామీ ఇచ్చారు.