భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న గాయత్రీ గుప్తా, వైద్యం ఖర్చు లక్షల్లో..!

గాయత్రీ గుప్తా ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె ఎక్కువగా తెలుగు చిత్రాలలో ప్రసిద్ధి చెందింది. అయితే ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో పైకి కనిపించేది మొత్తం నిజం కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. ముఖ్యంగా చాలా సెలబ్రిటీస్ ఎన్నో అరుదైన వ్యాధులతో బాధపడుతుంన్నారు. స్టార్ హీరోయిన్ సమంత సైతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే ఆమెకు డబ్బు ఉంది కాబట్టి.. విదేశాలకు వెళ్లి మరీ ట్రీట్ మెంట్ చేయించుకుంటుంది. అయితే.. అందరి దగ్గర అంత డబ్బు లేదు.

చాలామంది డబ్బు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అందులో నటి గాయత్రీ గుప్తా ఒకరు. ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల కంటే.. ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల తో మరింత ఫేమస్ గా మారింది. ఇక ఈ మధ్య దయ వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతుంది. డిప్రెషన్ వలన ఆమె ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను అని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యాధి ఇప్పుడు ముదురిపోయిందని, ట్రీట్ మెంట్ కోసం రూ. 12 లక్షలు అవసరమని చెప్పుకొచ్చింది.

ఇప్పటివరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఉన్నాయని.. ఎవరైనా దాతలు సాయం చేయాలనీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్. ఆయన తనవంతు సాయం అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటావని ఆమెకు భరోసా కల్పించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గాయత్రీకి హెల్ప్ చేయాలనీ కోరాడు. దీంతో ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ ఈ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఎవరైనా ఇంపాక్ట్ గురు. కామ్ కు ఇవ్వాలని కోరాడు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *