ఎఫైర్స్ నడుపుతూ అదే మంచి జీవితమని భావిస్తున్నారు, నటి షాకింగ్ కామెంట్స్.

తాజాగా ఆమె నేను సెల్ఫీస్ అంటూ ఒక వీడియోని విడుదల చేసింది. నేను నెలసరి సమయంలో కాఫీలు గట్రా తాగను. అవి తాగితే సమస్య ఎక్కువ అవుతుంది. పీరియడ్స్‌ ఉన్నప్పుడు పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. కాబట్టి నాలుగు రోజుల దాకా వాటి జోలికి వెళ్లను. మరీ ఏదైనా తాగాలి అనిపిస్తే లెమన్‌ టీ, అల్లం ఛాయ్‌ మాత్రమే తాగుతాను. మీరు కూడా పీరియడ్స్‌ సమయంలో కాఫీ జోలికి వెళ్లొద్దు. అయితే గాయత్రి రెడ్డీ తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ వీడియో చేస్తూ ఉంటుంది. ఈ సెల్ఫిష్ వీడియోలో స్త్రీలకు చక్కని హెల్త్ టిప్స్ ఇచ్చింది.

తన అనుభవాన్ని వారితో పంచుకుంది. తాను పిరియడ్స్ సమయంలో అస్సలు కాఫీ జోలికి వెళ్లను అని చెప్పింది. అలా కాఫీ తాగితే ఇబ్బంది ఎక్కువ అవుతుంది అని చెప్పింది. అలాగే పొత్తి కడుపులో నొప్పి పెరుగుతుంది అన్నది. మరీ తాగాలి అనిపిస్తే లెమన్ టీ, అల్లం టీ తాగుతానని చెప్పింది. అందరూ నెలసరి సమయంలో కాఫీ జోలికి వెళ్లకపోవడమే మంచిది అంటూ సూచించింది. ఇంక తన తల్లి తనని ఎప్పుడూ సెల్ఫిష్ అంటూ ఉంటుందని.. ఆ విషయాన్ని చెప్పడానికే ఈ వీడియో చేశాను అని చెప్పుకొచ్చింది.

“మా అమ్మ నన్ను సెల్ఫిష్ అంటుంది. ఆ మాట నిజమే. నాతో మంచిగా ఉండని ఫ్రెండ్స్ అందరినీ కట్ చేస్తుంటాను. నాకు కూడా ఫ్రెండ్స్ కావాలి అని ఉంటుంది. కానీ, వాళ్లు నేను ఎదగడానికి సహాయం చేయడం లేదు. వాళ్లు నా లైఫ్ లో ఉండటానికి వారికి ప్లేస్ లేదు. నేను లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాను, ఎదిగాను. కానీ, వాళ్లు ఇప్పటికీ అలాగే ఉండిపోయారు. వాళ్ల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎదగడానికి సహకరించని ఎవరినీ మీ లైఫ్ లో ఫ్రెండ్స్ గా పెట్టుకోకండి. ఫ్రెండ్స్ తో కూడా మీకు బౌండిరీలు ఉండాలి.

నేను సెల్ఫిష్ పర్సనే. కానీ, నాది హెల్తీ సెల్ఫిష్. నేను నా జీవితం కోసం సెల్ఫిష్ గా ఉన్నాను. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా లైఫ్ లో చాలా కొద్ది మంది మాత్రమే ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్లు నా ఎదుగదల చూసి ఆనందిస్తున్నారు. నేను కూడా నా విజయాల గురించి నిజంగా ఆనందించే వారికే వాటిని చెప్తాను. నెగిటివ్ వైబ్స్ ఉంటే వారికి బాయ్ చెప్పేయడమే. కొంతమంది మాత్రం ఎఫైర్లు నడుపుతూ అదే నిజమైన జీవితం అనుకుంటున్నారు. ప్రస్తుతం గాయత్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *