గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన‌ హ్యాపీ డేస్ ఫేమ్ ‘అప్పు’, ఎలా ఉందొ మీరే చుడండి.

గాయత్రి రావు అంటే గుర్తుకు రావ‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ, హ్యాపీ డేస్ ఫేమ్ అప్పు అంటే ఆమె ట‌క్కున మైండ్ లోకి వ‌చ్చేస్తుంది. శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీ డేస్‌ ఒక‌టి. అయితే హ్యాపీ డేస్ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి రావు, ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోనూ నటించింది, ఆరంజ్ సినిమాలో మాయ పాత్రలో ఆమె నటించగా , గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది, చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తు ఉంది పొయ్యే పాత్రలలోనే ఆమె నటించింది.

గత ఏడాది పెళ్లి చేసుకున్న గాయత్రీ రావు ఇప్పుడు చెన్నై లో స్థిరపడిపోయింది.పెళ్లి అయినా తర్వాత కూడా ఆమె సినీమాల్లో నటిస్తాను ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది.ఇది ఇలా ఉండగా గాయత్రీ రావు కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే, ఈమె తల్లి గురించి ఇటీవల సోషల్ మీడియా లో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి, అవి ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

గాయత్రి రావు తల్లి పేరు పద్మ మరియు తండ్రి పేరు అరుణ్ కుమార్, ఈమె తల్లి పద్మ ఎప్పటి నుండో టాలీవుడ్ లో నటిస్తూనే ఉంది, ఇప్పుడు సీరియల్స్ లో ఈమె మోస్ట్ బిజీ గా ఉండే ఆర్టిస్ట్, హ్యాపీ డేస్ సినిమాలో కూడా ఆమె నిఖిల్ కి తల్లి గా నటించింది, ఈ విషయం ఇప్పటి వరుకు మనకి తెలియదు.ఆమె ఫోటోలను మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, ఇక గాయత్రి రావు విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితం ని ఎంజాయ్ చేస్తోంది, అయితే మంచి నటన ప్రతిభ మరియు అందం రెండు ఉన్న కూడా ఎందుకో గాయత్రి రావు కి రావాల్సిన క్రేజ్ మరియు ఫేమ్ దక్కలేదు అనే చెప్పాలి.

హ్యాపీ డేస్ సినిమా తర్వాత కెరీర్ లో ఎక్కడికో వెళ్తుంది అనుకున్న అమ్మాయి కేవలం సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమతం అయ్యింది, 2007 లో విడుదల అయినా హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈమె కేవలం 7 సినిమాల్లోనే నటించింది అంటే అర్థం చేసుకోవచ్చు , పాపం ఈ అమ్మాయికి అదృష్టం కలిసి రాలేదు అని , మరి భవిష్యత్తులో లో అయినా గాయత్రి రావు కి మంచిగా అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *