గాయత్రి గుప్తా తెలుగు సినిమా నటి మరియు వ్యాఖ్యాత. ఆమె 2014లో విడుదలైన ఐస్ క్రీమ్ 2 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 2లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకుల పై ఆరోపణలు చేసింది. అందుకే తాను అందులో పార్టిసిపేట్ చేయకుండా తప్పుకున్నానని తెలిపింది.
ఆమె తెలుగు సినీరంగంలో కూడా కాస్టింగ్ కౌచ్, మీటూ ఉందని ఆరోపించింది. అయితే గాయత్రి గుప్తా నల్గోండలో ఇంజనీరింగ్ చదివింది. టాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించడానికి గాయత్రి గుప్తా హైదరాబాద్ వెళ్లారు. ఆమె 2006 లో సాక్షి టీవీలో తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది.కానీ గుర్తింపు తెచ్చిన చిత్రం ఏంటంటే శేఖర్ కమ్ముల రూపొందించిన ‘ఫిదా’సినిమా.
ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది గాయత్రి గుప్తా ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకుంది. అంతకుముందు లఘు చిత్రంతో ఆమె ప్రాచుర్యం పొందింది. తరువాత ఐస్ క్రీమ్ 2 చిత్రాలలో నటించిన తరువాత గుప్తా ఖ్యాతిని పొందారు.ఒక తెలుగు చిత్ర నిర్మాత తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వారి సినిమాను అంగీకరించిన తర్వాత లైంగిక సహాయం కూడా కోరినట్లు ఆమె ఆరోపించింది.