క‌డుపు ర‌గిలిపోతోంది, ఆవేశంతో ఊగిపోయిన బండ్ల గణేష్.

హైద‌రాబాద్ న‌గ‌రంలో సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏండ్లు పూర్త‌యిన క్ర‌మంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనిని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా నిర్వ‌హించగా, టీడీపీ నాయ‌కుల‌తో పాటు అనేక మంది ప్ర‌ముఖులు కూడా పాలుపంచుకున్నారు.

అయితే హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. నిర్మాత, నటులు బండ్ల గణేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఏడుస్తూ ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను దసరా పండుగను జరుపు కోలేదు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకునేలా చంద్రబాబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తాం. సైబరాబాద్ లాగా… ఏపీలోని అమరావతి, గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారు’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *