వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే వీటికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. కానీ ఆయింట్మెంట్లు, మందులు అందుబాటులో లేనప్పుడు, లేదా సహజంగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చిట్కాలు పాటించండి. అయితే వర్షాకాలం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సమయంలో సీజనల్ వ్యాధులతోపాటు, అలర్జీ సమస్య పెరుగుతుంది. వర్షాకాలంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించినా వాతావరణంలో తేమశాతం పెరగడం వల్ల ఈ రోజుల్లో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. చెమట వల్ల శరీరంలో బాక్టీరియా వృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని కారణంగా ప్రజలకు అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి.
తామర, గజ్జి, దురద, దద్దుర్లు లాంటి సమస్యలు పెరగడం వల్ల మరింత ఇబ్బందులు కలుగుతాయి. కావున ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ప్రయత్నిస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు.. ఆహారంలో మార్పుల ద్వారా కూడా అలర్జీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలర్జీ కారణంగా శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడతాయి. చర్మంపై చెమట చేరడం, అక్కడ బ్యాక్టీరియా క్రియాశీలత కారణంగా ఈ దద్దుర్లు సంభవిస్తాయి. దీని కారణంగా, దురద వస్తుంది. ఇది కొంతకాలం తర్వాత తీవ్రమైన దురదగా మారుతుంది. ఒక వ్యక్తి ఎంత దురదతో ఉంటే, అతని సమస్య అంత మరింత పెరిగిందని అర్ధం.. కావున కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
రింగ్‌వార్మ్ అలర్జీ: ఈ రోజుల్లో చాలామంది తామరతో బాధపడుతున్నారు. ఈ అలెర్జీ అనేది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా సంభవిస్తుంది. ఇందులో మెడ, చంకలు లేదా అరికాళ్ల దగ్గర చర్మంపై దురదతో కూడిన ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. దీనితో పాటు, చిన్న చిన్న మొటిమలు (పొక్కులు) వేళ్లు, కాలి మధ్య ఏర్పడి దురద ప్రారంభమవుతుంది. కలుషిత నీరు: వర్షాకాలంలో కలుషితమైన నీటి కారణంగా చాలా మందికి దురద వస్తుంది. నీటిలో ఉండే పరాన్నజీవుల వల్ల ఈ దురద వస్తుంది. దీని కారణంగా శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మొటిమలు లాంటివి ఏర్పడతాయి. దీనిల్ల దురద ఎక్కువగా ఉంటుంది.
దీనితో పాటు, ఉష్ణోగ్రతలో ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా చర్మం అకస్మాత్తుగా పొడిగా మారుతుంది. దీని కారణంగా కూడా శరీరం దురదను ఎదుర్కోవలసి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి: రుతుపవనాల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్య తీవ్రత ఆసుపత్రిలో చేరే వరకు పెరుగుతుంది. దీని కోసం, వర్షాకాలంలో అలర్జీని నివారించడానికి మీరు కొన్ని ప్రత్యేక చర్యలను భాగం చేసుకోవాలి. సమతుల్య, సరైన ఆహారం, పోషకాలు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. తద్వారా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి: బాక్టీరియాను తొలగించడానికి, ఇంట్లో స్వచ్ఛమైన గాలి వీచేలా చేయాలి. కిటికీలు తెరవాలి. సూర్యకాంతి లోపలికి వచ్చేలా చేయాలి. వేప ఆకులు, లవంగాలను ఉపయోగించి.. వాటి పొగను ఇంట్లో వేయాలి. మీ బెడ్ షీట్లు, కిటికీ కర్టెన్లు, కార్పెట్‌లు, టేబుల్ మ్యాట్‌లను క్రమం తప్పకుండా ఉతకాలి. ఇంట్లో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తే.. అలర్జీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.