ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలద్దు వెంటనే ఇంటికి తెచ్చుకోండి ఎందుకో తెలుసా..?

సంస్కృతంలో జయంతి వేద అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే దీనిని ప్రాంతాలవారీగా వైశాల కర్ని, గడ్డి చామంతి, గాయపాకు రావణాసురుతల ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో మన పూర్వీకులు దీనిని ఎప్పటినుండో వాడుతున్నారు. అయితే సాంప్రదాయకంగా గడ్డి చామంతిని శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి దీని ఆకు రసం మంచి ఔషధం. ఇప్పటికీ మనదేశంలోని అనేక గ్రామాల్లో దిమ్మలు, తామర, గజ్జి, బొబ్బలు , గాయాలకు ఈ గడ్డి చామంతిని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు. గడ్డి చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది. గాయం తగిలిన చోట ఈ ఆకు రసాన్ని పిండి కట్టుకడితే నొప్పులు తగ్గిపోతాయి. ట్రైడాక్స్ ప్రొక్యూంబెన్స్ అనేది జుట్టు పెరుగుదలకు సాంప్రదాయకంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధం.. ఇది భృంగరాజ్ స్థానంలో ఉపయోగించబడుతుంది. రాలిన జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి మంచి సహాయకారి.

ఈ మొక్క కాలేయ రుగ్మతలు, హెపాటోప్రొటెక్షన్, పొట్టలో పుండ్లు, గుండెల్లో మంట కోసం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్యనే పరిశోధనలో తేలింది. గడ్డిచామంతి ఆకులలో ఉండే జేర్యలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన ఎన్నో రకాల జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటి ఫ్లోరైడ్ శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈమధ్యే పరిశోధనల్లో తేలింది. గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు దోమల వలన వస్తూ ఉంటాయి.

ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది. దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు ఆపి తలుపుల మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి. మిగిలినవి బయటకు వెళ్లిపోతాయి. అంతేకాదు ఈ ఎండిన ఆకులను పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రావు. గడ్డిచామంతిలోని ఔషధ విలువలు గురించి అవగాహన లేక కలుపు మొక్క గావించి పీకేస్తుంటారు. ఈ మొక్క అనేక రకాల ఔషధ గుణాలను తనలో దాచుకుంది. ఈ మొక్కకు సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంలో ప్రత్యేక స్థానం ఉంది. వీటి ఆకులను ఆకుకూరగా కూడా తింటుంటారు. వీటిని పలక ఆకులు, గడ్డిచామంతి, గాజు తీగ, నల్ల ఆలం వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *