పైల్స్ మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. ఈ మొలలనే హేమోరాయిడ్స్ అని వైద్య పరిభాషలో అంటారు. అయితే మలద్వారం లోపల చుట్టూ వాపు వచ్చి పెరిగే కణుతులను పైల్స్ ఎమరైడ్స్, మొలలు అంటారు. అవి రక్తనాళాలు కండ మొదలైన వాటితోనే ఏర్పడే కణ సముదాయాలు ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి. మలద్వారం బయట కూడా ఇవి పెరవచ్చు. ఇది తీవ్ర సమస్య కాదు ఎందుకంటే సాధారణంగా వాటంత అవే తగ్గిపోతాయి.
కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుందంటున్నారు వైద్యులు. సాధారణంగా మొలలు జన్యు కారణాలు వృద్ధాప్యంకి చేరుకుంటున్న కొద్దీ ఎక్కువ అవుతుంది అని చెబుతున్నారు వైద్యులు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గర పొంగి వాచి మొలలుగా మారతాయి. దీనికి ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. మనం జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం.
అనారోగ్యమైన ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిలో ఒకటి అని అంటున్నారు వైద్యులు. చాలామందికి మొలల సమస్య ఉందని కూడా తెలియదు. కొన్ని లక్షణాలతో సమస్యని గుర్తించవచ్చు. మలద్వారం వద్ద నొప్పి రక్తస్రావం చాలా సాధారణం. చాలామందికి మల ద్వారం వద్ద వాపు లేదా పెద్ద బోడిపేలా లాగా పెరుగుతాయి. వాటినే పైల్స్ అంటారు. ఈ సమస్య కారణంగా దురద, స్రావం కూడా సాధారణమే. అదృష్టవశాత్తు ఈ సమస్యకు పరిష్కారం మన ఇంటి వద్దనే ఉన్నాయి. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు.
మొలలకి ఏకైక కారణం మలబద్ధకం అని.. అందుకు గల కారణాలు ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి ఇది మరింత సాధారణంగా వస్తుంది. ఏ రకమైన వ్యాయామం చేయని వారికి శరీరం కదపని వారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పైల్స్ ని రెండు నుండే మూడు వారాల వ్యవధిలోనే సమస్య మెరుగుపరిచే వైద్యం ఆయుర్వేద వైద్యంలో ఉందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.