కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి డాన్స్, డాన్స్ ఎలా చేసిందో చూడండి.

సోషల్ మీడియాలో సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తీస్ మార్ ఖాన్ చిత్రంలో కత్రినా కైఫ్ చేసిన ‘షీలా కీ జవానీ’ సాంగ్ అత్యంత పాప్యులర్. ఈ సాంగ్ కి సాయి పల్లవి తన ఫ్రెండ్స్ తో పాటు డాన్స్ చేసింది. సాయి పల్లవి ఎనర్జీ, మెస్మరైజింగ్ స్టెప్స్, గ్రేస్ మైమరిపించేలా ఉన్నాయి.

అయితే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి పల్లవి తన కెరీర్ ని డాన్స్ షోలో డాన్సర్ గానే స్టార్ట్ చేసారు. తెలుగు డాన్స్ షో ఢీలో కంటెస్టెంట్ గా పోటీ చేసిన పల్లవి.. ఆ తరువాత నటిగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. ఇక డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ నటి సినిమాల్లో అదిరిపోయే డాన్స్ వేస్తూ ఆడియన్స్ నుంచి విజుల్స్ అందుకుంటూ ఉంటారు.

ఢీ డాన్స్ షోలో, సినిమాల్లో సాయి పల్లవి వేసిన డాన్స్ ని అందరూ చూసే ఉంటారు. కానీ ఆమె చదువుకుంటున్న సమయంలో స్టేజి పై వేసిన డాన్స్ ఎవరైనా చూశారా..? అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాలేజీ ఫెస్ట్ లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి వేసిన డాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆర్య 2లోని ఐటెం సాంగ్ ‘రింగ రింగ’కి సాయి పల్లవి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు.

అలాగే బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ‘షీలాకి జవానీ’ పాటకి కూడా పల్లవి డాన్స్ వేసింది. మరి ఆ రెండు డాన్స్ వీడియోలు వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *