తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌.

తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు అవినాష్‌. తాను తండ్రి కాబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉందని వెల్లడించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం తన భార్య అనుజ నాలుగో నెల అని త్వరలోనే తాము పేరెంట్స్ హోదాని పొందబోతున్నట్టు, ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నట్టు తెలిపారు ముక్కు అవినాష్‌.

అయితే ఒకవైపు పలు షో లు చేస్తూనే తన భార్యతో కలిసి రియాల్టీ షోలు కూడా చేసిన అవినాష్ తాజాగా తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలో తాము పేరెంట్స్ గా ప్రమోషన్ పొందుతున్నామని ఈ మేరకు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ముక్కు అవినాష్ యూట్యూబ్లో నా భార్య అనూజ ప్రెగ్నెంట్.. మా పెళ్లి అయి ఏడాదిన్నర అవుతోంది.. అక్టోబర్లో మా పెళ్లి రోజు.. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని మమ్మల్ని ఎప్పటినుంచో చాలామంది అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాము.

త్వరలోనే బాబు లేదా ఒక పాప మా ఇంటికి రాబోతోంది. పెళ్లయిన ఏడాదిన్నరకే తల్లిదండ్రులు కావడం నిజంగా సంతోషంగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు నాలుగో నెల.. అందుకే ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు పెట్టాము.. మాకంటే కూడా మా అమ్మ నాన్న, అత్తమామలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. నాలుగో నెలలో బేబీ గుండె చప్పుడు కూడా మేము విన్నాము.. అప్పుడు కలిగిన ఆనందాన్ని మేం మాటల్లో చెప్పలేకపోతున్నాము.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు అవినాష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *