చెవిలో గులిమి ఒక్కసారితో తొలగిపోవాలంటే ఈ చిన్న పని చేయండి.

మనలో చాలామంది అగ్గిపుల్లలకు దూది చుట్టి, పిన్నీసులు పెట్టి గులిమి తీసుకుంటూ ఉంటారు. ఈ పద్ధతుల వల్ల కొన్ని సందర్భాల్లో చెవుల్లోని సున్నిత మైన ప్రదేశాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుంది. చాలా మందిలో గులిమి ఎక్కువ‌గా త‌యారై ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే చెవుల్లో మాటిమాటికీ దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరి చెవిలో గులిమి ఏర్పడటం సహజమే. అది చెవిలో ఉండే నరాలకు రక్షణగా ఉంటుంది.

అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. గులిమిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి చెవిని శుభ్రం చేస్తాయి. ఈ విధంగా తయారైన గులిమి బయటకు దాని అంతట అదే వెళ్ళిపోతుంది.అయితే కొంతమంది ఈ విధంగా గులిమి ఏర్పడటం మంచి పద్దతి కాదని భావించి పిన్నీస్ లేదా ఇయర్ బడ్ లతోనే తీసేస్తూ ఉంటారు. కానీ ఆలా చేయటం మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. కొంత మందిలో గులిమి సాధారణ స్థాయిలో కన్నా ఎక్కువగా తయారవుతుంది.

ఆలా ఎక్కువగా గులిమి ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల గులిమిని బయటకు తీయటానికి సహజమైన పద్దతి ఉంది.ఈ పద్దతి చాలా సులువైనది.అది ఏమిటంటే….గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి.ఈ నీటిలో కాటన్ బాల్ ముంచి చెవిని వంచి ఆ నీటిని పిండాలి.ఐదు నిముషాలు అయ్యాక నీటిని పిండిన చెవిని వంచటం ద్వారా చెవిలోని గులిమి వదిలిపోతుంది.ఇలా రెండు చెవులను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కలపని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన చెవిలో ఉన్న గులిమి తొలగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *