చాలా కాలం క్రితం జాన్ W.ఆర్మ్‌స్ట్రాంగ్ అనే బ్రిటీష్ వ్యక్తి ప్రారంభించిన “యూరిన్ థెరపీ” అనే ఔషధం నుంచి ఈ పరిష్కారాన్ని కనిపెట్టినట్లు ఆమె నమ్మ బలిసింది.యూరిన్ థెరపీని ఇష్టపడే వ్యక్తులు దీనిని చర్మంపై రుద్దడం, చిగుళ్లపై పెట్టుకోవడం లేదా తాగడం వంటి అనేక విషయాలకు ఉపయోగిస్తారు. అయితే తాజాగా స్పానిష్ టిక్‌టాకర్ సుమా ఫ్రేల్, తన మూత్రాన్నే కంటి సమస్యలకు పరిష్కారంగా వాడుతున్నట్లు చెప్పింది.
తన యూరిన్‌ను ఐ డ్రాప్స్‌గా వాడుతూ కంటి చూపును మెరుగుపర్చుకున్నట్లు చెప్పింది. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సుమా ఫ్రేల్, టిక్‌టాక్‌లో “అసిస్టెంట్ మెటాఫిజికల్ కౌన్సెలర్” అనే ట్యాగ్ తగిలించుకుని సలహాలు ఇస్తోంది. ఇటీవల ఒక వీడియో షేర్ చేస్తూ, కంటి సమస్యలకు చికిత్సగా మూత్రాన్ని ఉపయోగించాలని ఫాలోవర్లకు సలహా ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ, యూరిన్‌ను ఐ-డ్రాప్స్ గా ఉపయోగించాక మయోపియా , కంటి చూపు సమస్యలను నయం చేసుకోగలిగానని, మూత్రంతో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పింది.
రోజూ కళ్లలో యూరిన్ చుక్కలు వేసుకోవడంతో కంటి చూపు మెరుగుపడిందని పేర్కొంది. ఈ సందర్బంగా సంప్రదాయ ఔషధాలను కూడా విమర్శించింది. అవి హానికరమైన రసాయనాలు అని వాటిని వాడితే చాలా ప్రమాదకరమని ఆరోపణలు చేసింది. ఉదయం, సాయంత్రం మూత్రాన్ని ఐ డ్రాప్స్‌గా వేసుకుంటే అదిరిపోయే ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది.
— video_profugos (@x_videoprofugos) February 13, 2024