వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్ధాలున్నాయి.
అయితే ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించేవారు ఉపవాసం ఉండటం చాలా మంచిది. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని భావించేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసానికి ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడు చాలా నిష్టగా స్వీయ నియంత్రణ మరియు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ప్రారంభించడానికి, ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, విష్ణువును మనసారా ధ్యానించాలి.
ఇక ఈ పుత్రదా ఏకాదశి వ్రతం పాటించే వారు నిర్జల వ్రతం చేయాలి. ఉపవాసం తరువాత మరుసటి రోజు ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణ వ్యక్తికి లేదా పేద వ్యక్తికి అన్నదానం చేసి దక్షిణగా దానం చేయాలి. ఇలా చేయటం వల్ల జీవితాంతం ఆనందాన్ని పొందుతారు. అంతే కాకుండా మరణం తరువాత కూడా మోక్షాన్ని పొందుతారు.